Gira Gira Gingiraagirey Song Lyrics

Gira Gira Gingiraagirey Song Lyrics: Champion

Gira Gira Gingiraagirey” from the movie Champion (2025) is a vibrant Telugu song sung by Ram Miriyala, composed by Mickey J Meyer, and written by Shyam Kasarla. The track features energetic choreography, a festive vibe, and showcases Roshan and Anaswara Rajan in the music video.

Gira Gira Gingiraagirey Song lyrics

ఎర్రెర్ర బొట్టు దిద్ది వెండి మేఘం మెరిసిందే.. మెరిసిందే
పచ్చాని చీరకట్టి పంట చేనే మురిసిందే.. మురిసిందే
పరదాలే తీసేద్దాం.. దిగిదిగిదిత్తాం.. దిత్తాం.. దిత్తాం

ఏ.. మబ్బు వెనకా.. ఏ సినుకు ఉందో.. ఏడా రాలునో..
ఏ.. తొవ్వలోనా.. ఏ.. మలుపు ఉందో.. ఏడాగునో.. సాగునో..

ఏ ఎండల్లో దాగి ఏడు రంగుల్లో హరివిల్లే పుట్టెను కదా..
ముల్లైనా, పూలైనా కొమ్మకు పూసే కదా.. 

గిరగిర గింగిరాగిరే.. సరసర సరబొంగరాలివే..
జరజర చుట్టు తిరిగిలే.. అందాల భూమి, సూర్యడిలా
గిరగిరా గింగిరాగిరే..తుర్రుతుర్రు తోకపిట్టలే..
చెర్రచెర్ర ఎగిరిపోవులే.. రయ్యంటూ రాయి వడిసెల్లా..

ఎర్రెర్ర బొట్టు దిద్ది వెండి మేఘం మెరిసిందే.. మెరిసిందే..
పచ్చాని చీరకట్టి పంట చేనే మురిసిందే.. మురిసిందే..
పరదాలే తీసేద్దాం.. దిగిదిగిదిత్తాం.. దిత్తాం.. దిత్తాం

పల్లే.. తల్లిలా కొంగునే చాపినాదే..
ఒళ్లో.. గువ్వలా దాచినాదే..
ఊరే..స్నేహమే ఊరిన ఊట సెలిమాయే
చుట్టూ పక్కా ఏ గోడలు.. అడ్డేలేని ఈ వాడలు
ముద్దుగున్నాయే.. హత్తుకున్నాయే..
మనసుతోనే అందరూ సొంతమనే..

గిరగిర గింగిరాగిరే.. సరసర సరబొంగరాలివే..
జరజర చుట్టు తిరిగిలే.. అందాల భూమి, సూర్యడిలా
గిరగిరా గింగిరాగిరే..తుర్రుతుర్రు తోకపిట్టలే..
చెర్రచెర్ర ఎగిరిపోవులే.. రయ్యంటూ రాయి వడిసెల్లా..

రా..లే.. సుక్కలే గాజులా సప్పుడాయే..
లే..నీ.. హాయిలో ముంచినాయే..
దూ..రం.. చూడగా దారిలో దగ్గరైపోయే..
చల్లారనీ సంతోషమే.. తెల్లారగా ఉండాలని..
పంచుకున్నాయే.. పెంచుకున్నాయే.. 
తెల్వకనే తెలిసిన చుట్టంలా..

గిరగిర గింగిరాగిరే.. సరసర సరబొంగరాలివే..
జరజర చుట్టు తిరిగిలే.. అందాల భూమి, సూర్యడిలా
గిరగిరా గింగిరాగిరే..తుర్రుతుర్రు తోకపిట్టలే..
చెర్రచెర్ర ఎగిరిపోవులే.. రయ్యంటూ రాయి వడిసెల్లా.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.